నాగజ్యోతికి ఉపాధ్యాయ రత్న అవార్డు
అవార్డు అందుకుంటున్న రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల టీచర్ నాగజ్యోతి
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల అంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎన్. నాగజ్యోతి విశాఖపట్నంలో సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ వారి చేతుల మీదుగా ఉపాధ్యాయరత్న అవార్డు ఆదివారం అందుకున్నారు. ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యారంగంలో 27 సంవత్సరాల పాటు అంకితభావంతో పని చేస్తూ, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్‌గా దేశానికి పలు పలు అంతర్జాతీయ పతకాలు సాధించిన వనిత అని నాగజ్యోతి అభినందించారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత భాధ్యత పెంచిందని. భవిష్యత్‌లో కూడా తన సేవలు అన్ని రంగాల్లోను విస్తరింపజేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.


