స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ప్రమాదానికి గురైన కారు
గొలుగొండ: గొలుగొండ రైస్ మిల్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. దీంతో స్తంభం ధ్వంసం కావడంతో పాటు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. చిన్నయ్యపాలెంకు చెందిన వరహాలు అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం నర్సీపట్నం నుంచి చిన్నయ్యపాలెం వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు పొలం, స్తంభం ఆనుకుని ఉండడంతో స్తంభాన్ని కారు బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో వరహాలబాబుకు నిద్ర రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలుపుతున్నారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కావడం వల్ల వరహాలబాబుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ సమస్య లేకుండా విద్యుత్‌శాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు.


