డాక్టర్‌ను అవుతా..
జిల్లా ఫలితాలు ఇలా...
జనరల్ ఫస్టియర్ 62.62 శాతం సెకండియర్ 72.98 శాతం
వొకేషనల్ ఫస్టియర్ 55.97 శాతం సెకండియర్ 67.15 శాతం
కశింకోట: వైద్యురాలిగా సేవలు అందించడమే తన ధ్యేయమని కంట్రెడ్డి రాజులమ్మ చెప్పింది. ఆమె తేగాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో చదివి బైపీసీలో 983/1000 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ నీట్ కోచింగ్ తీసుకుంటున్నానని, ప్రవేశ పరీక్ష రాసి పశు వైద్యాధికారి కావాలని భావిస్తున్నానన్నారు. రావికమతం మండలం గొండ గ్రామానికి చెందిన ఆమె తండ్రి నాయుడు, తల్లి మంగ వ్యవసాయదారులు. రాజులమ్మ టెన్త్‌లో 553 మార్కులు సాధించి బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేట హైస్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.
బైపీసీ 9831000


