జెడ్పీ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ వితరణ
హెచ్‌ఎంకు కంప్యూటర్ అందజేస్తున్న లయన్స్ క్లబ్ నవ్య ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సభ్యులు
రోలుగుంట : నర్సీపట్నం లయన్స్ క్లబ్ నవ్య వారు గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌కు కంప్యూటర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ క్లబ్ తరపున ఏటా ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ క్లబ్ సభ్యురాలు ఈ పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పి.వి.ఎం నాగజ్యోతి అభ్యర్థన మేరకు పాఠశాలకు కంప్యూటర్‌ను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సంఘ క్లబ్ సభ్యులు చైతన్య, విజయ్ కుమార్ పాల్గొన్నారు.


