పొట్ట కూటికి వెళ్లి అనంత లోకాలకు..
● ఒకే గ్రామానికి చెందిన ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో మృతి
బుచ్చెయ్యపేట: బంగారుమెట్ట గ్రామానికి చెందిన ఇద్దరు పొట్ట కూటి కోసం వెళ్లి వేర్వేరు గ్రామాల్లో గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. మేరుగు శ్రీను(28) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అరకులో పెయింటింగ్ పని కోసం వెళ్లి సోమవారం పనులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. స్ధానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతను మృతి చెందాడు. లక్ష్మీనారాయణ విశాఖలో కార్పెంటర్ పనులు చేస్తుంటాడు. మధురవాడ వద్ద నడిచి వెళ్తుండగా గుండెపోటుతో రోడ్డుపక్కనే కుప్పకూలి మృతి చెందాడు. లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలుండగా.. శ్రీనుకు తండ్రి ఉన్నాడు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందడంతో ఈ రెండు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. వీరిద్దరి మృతదేహాలకు మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
పొట్ట కూటికి వెళ్లి అనంత లోకాలకు..


