24 లీటర్ల సారా స్వాధీనం
నాటు సారాను స్వాధీనం చేసుకున్న
సీఐ శ్రీనివాసరావు
పాయకరావుపేట: మండలంలోని గుంటపల్లి, పెదరాంభద్రపురం, అరట్లకోట గ్రామాల్లో దాడులు నిర్వహించి 24 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరు పురుషులు, ఒక మహిళను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామన్నారు. వారిని యలమంచిలి కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. అదే విధంగా గతంలో సారాతో పట్టుబడిన 8 మందిని నక్కపల్లి మండల తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశామన్నారు.


