పురస్కారాలు పొందిన గాయత్రి స్కూలు ఉపాధ్యాయులు విజయదుర్గ, హరిచందన
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో గాయత్రి స్కూలుకు చెందిన ఉపాధ్యాయులు ఎ.విజయదుర్గ, సి.హెచ్. హరిచందనలకు ఉభయ విశాఖ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు లభించాయి. విశాఖపట్నంలో ఉభయ జిల్లాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.ముత్యాలనాయుడు, ఏపీపీయూఎస్‌ఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎ.కృష్ణారెడ్డి, ప్రాంతీయ అధ్యక్షుడు ఎం.వి.రావు చేతుల మీదుగా వారు పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు శుక్రవారం వారిని అభినందించారు.
చెరువులో పడి వృద్ధుడి మృతి


