18 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

18 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్టు

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

● వారిలో ఒకరు మైనర్‌ బాలుడు ● రెండు స్కూటీలు స్వాధీనం

చీడికాడ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ బి.సతీష్‌ తెలిపారు. ఆయన గురువారం అందించిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని అప్పలరాజుపురం లలితా దేవి మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు స్కూటీలపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా ఆపి తనిఖీ చేయగా రెండు వాహనాల్లో 18 కిలోల గంజాయిని గోనె సంచిల్లో గుర్తించామన్నారు. దీంతో విజయవాడ ప్రాంతానికి చెందిన ఎం.యువనాగ సాయి సుధర్‌, వాసి గోపితో పాటు 17 సంవత్సరాల మైనర్‌ బాలుడిని పట్టుకున్నామన్నారు. వీరు అల్లురి జిల్లా పాడేరు ఏజేన్సీకి చెందిన గుంత నర్సు, నారీస్‌ పాంగి వద్ద నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు తరలిస్తున్నట్టు విచారణలో తెలిపారన్నారు. వారి వద్ద రెండు స్కూటీలు, గంజాయిని, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధినం చేసుకుని కోర్టుకు తరలించామని తెలిపారు.

గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్‌

బుచ్చెయ్యపేట : గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకుని కోర్టుకి అప్పగించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన బుచ్చెయ్యపేట వద్ద 194 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న చీడికాడ మండలం బైలపూడికి చెందిన గొల్లవిల్లి గోపిని వడ్డాదిలో వాహనాల తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నామన్నారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తించి సీఐ కోటేశ్వరరావు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు.

పట్టుబడిన గంజాయి నిందితులతో ఎస్‌ఐ సతీష్‌

బుచ్చెయ్యపేటలో పట్టుకున్న వ్యక్తితో సీఐ, ఎస్‌ఐ

Advertisement
 
Advertisement
Advertisement