సాక్షి, పాడేరు: మైదాన ప్రాంతం నుంచి జి.మాడుగుల జీసీసీ బంక్‌కు పెట్రోల్,డీజిల్ రవాణా చేస్తున్న ఆయిల్‌ట్యాంకర్‌కు పాడేరు ఘాట్‌లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.పాడేరు ఘాట్ రోడ్డు నుంచి అతివేగంగా దిగుతున్న టిప్పర్‌ను తప్పించేందుకు ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కనున్న కొండవైపునకు మళ్లించాడు.కొండకు ఆనుకుని ట్యాంకర్ ఒరిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.టిప్పర్,ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.పాడేరు ఘాట్‌లోని ఏసుప్రభువు విగ్రహం మలుపు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ లీకు అయింది.పొక్లెయినర్ సాయంతో ట్యాంకర్‌ను రోడ్డుపైకి తీశారు.
కొండకు ఆనుకుని ఒరిగిన ఆయిల్ ట్యాంకర్


