జాతరకు సర్వం సిద్ధం
యలమంచిలి రూరల్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన యలమంచిలి కనకమహాలక్ష్మి జాతర సోమవారం జరగనుంది. లక్షలాది మంది భక్తులు తరలిరానుండడంతో అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఏటా మార్గశిర మాసోత్సవాల అనంతరం సంక్రాంతి తర్వాత అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటికే పట్టణంలోని ధర్మవరం కనకమహాలక్ష్మి ఆలయం, ప్రధాన రహదారి, క్లబ్ రోడ్డు సహా పలు ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది. అమ్మవారి జాతర నిర్వహించే రాజీవ్ క్రీడా మైదానంలో జెయింట్‌వీల్, రంగులరాట్నం, పిల్లలకు ఆటవిడుపుగా ఉండే పలురకాల సెట్టింగులు ఏర్పాటు చేశారు. పాత, కొత్త తరాలని అలరించేలా చింతామణి నాటకం, స్టేజీ ప్రోగ్రాంలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఉండేలా ఉత్సవ కమిటీ చర్యలు చేపట్టింది. అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకునే అవకాశం ఉండడంతో ఆలయం వద్ద బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జాతరను మరింత వైభవంగా నిర్వహించేలా జాగ్రత్త తీసుకుంటున్నామని అమ్మవారి ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొఠారు సాంబశివరావు, సభ్యులు తెలిపారు. ఈ మేరకు శనివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జాతర ఏర్పాట్లు వివరించారు. ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని, వినోదం కోసం వివిధ రకాల కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయన్నారు. ధర్మవరానికి చెందిన కొఠారు నానాజీ 20 వేల మంది భక్తులకు అన్నదానం అందించేందుఉ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా అన్నప్రసాదాన్ని తమ సొంత నిధులతో అందజేస్తున్నారు. కార్యక్రమంలో అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు మడుగుల సత్యనారాయణ, కొఠారు కొండబాబు, కొఠారు నరేష్, కొఠారు సూర్య ప్రకాష్, తాటిపాకల నాని, గొల్లవిల్లి చిన్నాజీ, తుంపాల దుర్గా ప్రసాద్, కొసిరెడ్డి నాగు, తుంపాల రాజారావు, పిల్లా రాము పాల్గొన్నారు.
కనకమహాలక్ష్మి జాతర రేపు
లక్షన్నరకుపైగా భక్తులు
తరలివస్తారని అంచనా
ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ
విద్యుత్ దీపాలతో
కాంతులీనుతున్న పట్టణం
జాతరకు సర్వం సిద్ధం
జాతరకు సర్వం సిద్ధం
జాతరకు సర్వం సిద్ధం
జాతరకు సర్వం సిద్ధం


