8 మంది కోడి పందెం రాయుళ్ల అరెస్టు
కశింకోట: మండలంలోని మూడు గ్రామాల్లో కోడి పందాలు ఆడుతున్న 8 మందిని పట్టుకుని అరెస్టు చేసినట్లు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2,050, ఆరు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కన్నూరుపాలెంలో కోడి పందాలు ఆడుతున్న నలుగుర్ని అరెస్టు చేసి రూ.650, రెండు పందెం కోళ్లు, అచ్చెర్ల వద్ద ఇద్దర్ని అరెస్టు చేసి రూ. 720, పరవాడపాలెం వద్ద ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి రూ.680 స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు. ఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బంది దాడులు నిర్వహణలో పాల్గొన్నారు.
కొడి పందాల శిబిరాలుపై దాడి
రావికమతం: మండలంలో గుడ్డిప గ్రామంలో కోడి పందాలు శిబిరంపై శనివారం రావికమతం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు పందెం కోళ్లును రూ.1,550 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


