భోగిమంటలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలు
సాక్షి,పాడేరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ జీవోలను భోగిమంటలో వేసి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. పాడేరులోని జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం రాత్రి భోగి మంట వేశారు. ఆ మంటలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవో పత్రాలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు,ఇతర నేతలు వేసి దహనం చేశారు.పేదలకు ఉచిత విద్య,వైద్యంను దూరం చేసే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవోలను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర,అధికార ప్రతినిధులు కిల్లు కోటిబాబు,కూడా సురేష్‌కుమార్,కూడా సుబ్రహ్మణ్యం,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్,మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


