గిరిజన శాస్త్రవేత్తకుఘనంగా సన్మానం
సాక్షి,పాడేరు: గ్లోబల్ వార్మింగ్‌పై అఽంటార్కిటిక్ మంచు ఖండంలో పరిశోధనకు వెళ్లిన 55మంది భారత శాస్త్రవేత్తల బృందానికి సారఽథ్యం వహించిన గిరిజన శాస్త్రవేత్త పరదాని వెంకట రమణమూర్తిని అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మంగళవారం ఘనంగా సన్మానించారు. పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇటీవల స్వదేశానికి వచ్చిన సందర్భంగా వెంకటరమణమూర్తికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్భ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ పరదాని లింగేష్‌కు వెంకటరమణమూర్తి స్వయాన తమ్ముడు. ఉక్కుర్భ గ్రామంలో శాస్త్రవేత్తకు ఘన స్వాగతం లభించింది.మాజీ ఎమ్మెల్యే పాల్గుణ దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశాఖ నగర ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లకే చిట్టిబాబు,ఇతర గ్రామపెద్దలు పాల్గొన్నారు.


