గంగవరం పోర్టుకు ఐసీసీ ఎన్విరాన్‌మెంటల్ ఎక్స్‌లెన్స్ అ
ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకుంటున్న అదానీ గంగవరం పోర్టు ప్రతినిధులు
పెదగంట్యాడ(విశాఖ): అదానీ గంగవరం పోర్టుకు ఐసీసీ ఎన్విరాన్‌మెంటల్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిర్వహించిన 19వ ఎన్విరాన్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ప్లాటినం విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డును గంగవరం పోర్టు ప్రతినిధులు మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడేళ్లలో ఆరు జాతీయ అవార్డులు అందుకున్నామని తెలిపారు. ఈ అవార్డుతో తమ పోర్టు బాధ్యత మరింత పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోర్టు అనేక కార్యకలాపాలు చేపడుతోందని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.


