21 నుంచి గ్రామసభలు
ఐటీడీఏ పీవో అపూర్వభరత్
చింతూరు: పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన 32 గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 18 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని, మిగతా గ్రామాల్లో ఈనెల 21 నుంచి నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి అపూర్వభరత్ తెలిపారు. ఉలుమూరు, చూటూరులలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. గ్రామసభలు ముగిసిన తరువాత డ్రాఫ్ట్ ఆర్‌అండ్‌ఆర్ నిర్వహించి తుది డేటాను సేకరిస్తామని, అనంతరం నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమవుతుందని ఆయన చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. చూటూరు గ్రామసభలో ఆయన నిర్వాసితులతో మాట్లాడుతూ అనర్హుల జాబితాలో పేర్లు వచ్చిన వారితో పాటు పేర్లు రానివారు తగిన ఆధారాలు సమర్పిస్తే వాటిని పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, ఎస్డీసీ చంద్రశేఖర్, తహసీల్దార్ చిరంజీవి, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.


