రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మూడోస్థానంలో సీలేరు జెన్
సీలేరు: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సీలేరు జెన్‌కో జట్టు మూడవ స్థానంలో నిలిచింది. మూడు రోజుల పాటు వీటీపీఎస్ (విజయవాడలో) నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మూడవ స్థానం కోసం సీలేరు, రాజమహేంద్రవరం జట్లు తలపడగా సీలేరు జట్టు 42–17 స్కోర్‌తో రాజమహేంద్రవరం జట్టుపై విజయం సాధించింది. సీలేరు జట్టులో ఏడీఈ శ్రీనివాసులు బెస్ట్ రైడర్‌గా ఎంపికయ్యారు. గెలుపొందిన సీలేరు జట్టుకు ట్రోఫీ, నగదు బహుమతిని అందజేశారు.సీలేరు జట్టుకు మూడవ స్థానం రావడంతో ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ సూపరింటెండింగ్ ఇంజినీరు చంద్రశేఖర్ రెడ్డి ,ఈఈ శ్రీనివాసరెడ్డి ,పలువురు ఇంజనీర్లు ,సిబ్బంది అభినందించారు.


