ఆశలు గల్లంతు?
జాబితాలు చూసి బెంబేలు
కూనవరం: విలీన మండలాల్లో జరుగుతున్న గ్రామ సభలు నిర్వాసితులకు భరోసా కల్పించకపోగా వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్పష్టత ఇవ్వకుండా మళ్లీ, మళ్లీ దరఖాస్తులు ఇవ్వండని అధికారులు చెబుతుండడంతో నిర్వాసితుల గుండెల్లో రైళ్లు పరిగెడుత్తున్నాయి. గ్రామ సభ నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వస్తుందని ఎదురుచూసిన నిర్వాసితులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితిని చూసి నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. ఆరేడు దశాబ్దాల నుంచి స్థానికంగా ఉంటున్నా తమ పేర్లు పీడీఎఫ్ (ప్రాజెక్ట్ డిస్‌ప్లేస్డ్ ఫ్యామిలీస్) జాబితాలో గల్లంతు అయ్యాయని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. భూములు, ఇంటి స్థలం, స్థిరాస్తులు కోల్పోయి, ఎక్కడికి వెళ్లి బతకాలో తెలియని దుస్థితిలో ఉన్న తమకు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందని ద్రాక్ష అన్న చందంగా మారుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు.
అసలేం జరుగుతోందంటే...
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో 41.15 కంటూకు స్థాయికి ముందే ముంపునకు గురవుతున్న 32 గ్రామాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లాడర్ సర్వే ద్వారా గుర్తించి ఆయా గ్రామాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దాన్ని కేంద్రం ఆమోదించించింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పునరావాస ప్రక్రియ ఊపు అందుకుంది. ఈ క్రమంలో ఫేజ్ 1బి కింద విలీన మండలాల్లో 32 గ్రామాలను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు పరిధిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రకటించారు.
చట్టానికి భిన్నంగా... క్షేత్రస్థాయిలో
ప్రజల ప్రయోజనం కోసం నిర్మించే కట్టడాల మూలంగా పోలవరం నిర్వాసితులు భూమి, ఇళ్లు, ఆస్తి తదితరవి కోల్పొతే 2013 భూసేకర్ణ చట్టం విభాగం యొక్క3(సీ) (1) ప్రకారం ప్రభావిత కుటుంబం, ప్రభావిత ప్రాంతంలో నివసించకపోయినా ఆ కుటుంబాన్ని ప్రాజెక్ట్ ఎఫెక్ట్టెడ్ కుటుంబం (పీఏఎఫ్)గా పరిగణించవచ్చు. అంతేగాక ఈచట్టంలో రెండవ షెడ్యూల్ ప్రకారం ప్రభావిత కుటుంబాలు దారిద్య్రరేఖకు పైనఉన్నా లేదా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నా సంబంధం లేకుండా పునరావాస, పునరస్థాపన హక్కులను పొందేందుకు అర్హులు. అయితే బతుకుతెరువుకోసం పొరుగుమండలాల్లో పనులకు వెళ్లి వారానికి, నెలకొకసారో వచ్చి పోతున్న వారిని అధికారులు అనర్హులుగా గుర్తించడం తీవ్ర అన్యాయమని నిర్వాసితులు మండి పడుతున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క నిర్వాసితున్ని నష్టపోనీయం అని పదేపదే చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టేకులబోరు ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలో నిర్వాసితుల పేర్లు చదువుతున్న కార్యదర్శి (ఫైల్)
ఆర్ అండ్ ఆర్...
మొత్తం గ్రామాలు
32
13,817
అనర్హులు
327
పోలవరం ముంపు ప్రియార్టీ మండలాలు
కూనవరం, వీఆర్‌పురం, చింతూరు
దరఖాస్తులు పెట్టుకున్నా సరికాని వైనం
అనర్హులు అంటూ
తిరస్కరణ
తాజాగా సంబంధిత గ్రామపంచాయతీల నోటీసు బోర్డుల్లో పెట్టిన జాబితాల్లో కొందరి పేర్లు అనర్హులుగా, మరి కొందరి పేర్లు అర్హులని, కొన్ని కుటుంబాల పేర్లు ఏకంగా పీడీఎఫ్ జాబితాలోనే లేవని పేర్కొనడంతో నిర్వాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. 60, 70 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటున్నా తమ పేర్లు పీడీఎఫ్ జాబితాలోనే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూనవరం, వి.ఆర్.పురం, చింతూరు మండలాల్లో జరుగుతున్న ఆర్‌అండ్‌ఆర్ గ్రామ సభల్లో అర్హులు, అనర్హులు, జాబితాలు చదివి వినిపిస్తుంటే ఆందోళన కలుగుతోందని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం నిర్వాసితులు
ఆర్‌అండ్‌ఆర్‌గ్రామసభలు జరిగిన గ్రామాలు
14
14 గ్రామాల్లో
మొత్తం నిర్వాసితులు
3,837
అధికారులు అర్హులుగా పేర్కొన్నవారు
3,510
పీడీఎఫ్ జాబితాలోనా పేరు లేదు
పీడీఎఫ్ జాబితాలో నాపేరు లేకపోవడంతో విస్తుపోయాను. మెయిన్ రోడ్డులోనే నా ఇల్లు ఉంది. భవనం వ్యాల్యూలో పరిహారం కూడా ప్రకటించా రు. నేను గ్రామం వదిలి పెట్టి ఎక్కడికీ వెళ్లిన దాఖలాలు లేవు. 20 ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం కారు చౌకగా ఎకరం కేవలం రూ.1.15 లక్షలకు ప్రభుత్వానికి స్వాధీనపరిచి త్యాగం చేశాం. అలాంటిది ఆర్‌అండ్‌ఆర్ పీడీఎఫ్‌లో నాకు తీవ్ర అన్యాయం చేశారు.
– కల్లం వీరాంజనేయులు,
నిర్వాసిత రైతు టేకులబోరు.
పనులులేక పక్క ఊరెళితే అర్హుడు కాదంటున్నారు
పోలవరం ముంపు గ్రామాల్లో దశాబ్దం నుంచి అభివృద్ధి పనులు ఆపేశారు. బతుకు దెరువు కోసం పొరుగు మండలం వెళ్లి పనులు చేసుకుంటుంటే స్థానికంగా లేవంటూ నా పేరు అనర్హుల జాబితాలో పెట్టారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటర్‌ఐడీ కార్డు, ఇంటిపన్ను రశీదు, బ్యాంకు అకౌంటు, కరెంటుబిల్ల్, పాన్‌కార్డుమ కులం సర్టిపికెట్‌తో సహా అన్ని ప్రూఫ్‌లు ఉన్నా నాపేరు ఇన్‌ఎలిజిబుల్ జాబితాలో చూపించారు.
– పుట్టి అంజన్‌రావు,నిర్వాసితుడు, కూనవరం
ఆశలు గల్లంతు?


