సంపూర్ణ గిరిజనాభివృద్ధే లక్ష్యం
సాక్షి, పాడేరు: సంపూర్ణ గిరిజనాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుజేయాలని దిశ కమిటీ అధ్యక్షురాలు,అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ,పర్యవేక్షణ కమిటీ(దిశ)సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. గత మూడు నెలల వ్యవధిలో 27శాఖల ద్వారా అమలైన అఽభివృద్ధి పనులపై సమీక్షించారు.ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనులకు మౌలిక సదుపాయాలు సమకూర్చాలన్నారు. చిరుధాన్యాలతో ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. నాబార్డు ద్వారా అమలవుతున్న పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు.జాతీయ రహదారి నిర్మాణంతో ధ్వంసమైన చెక్‌డ్యామ్‌లు,తాగునీటి పైపులైన్ వ్యవస్థలను వెంటనే పునరుద్ధరించాలని, గిరిజన రైతులకు వ్యవసా య పరికరాలను పంపిణీ చేయాలని తెలిపారు. మొదటి విడతలో 10 అంబులెన్స్‌లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల వివరాలను సమర్పించాలన్నారు. 108 సూర్యనమస్కారాలను విజయవంతంగా నిర్వహించి వరల్డ్ రికార్డ్ సాధించడంపై కలెక్టర్,ఇతర అధికారులను ఆమె అభినందించారు
ఆర్గానిక్ జిల్లా లక్ష్యంగా కృషి : కలెక్టర్ కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఆర్గానిక్ జిల్లా లక్ష్యంగా అధికారులంతా కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేసే సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు.జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరగాలని, లక్ష ఎకరాల్లో కాఫీతోటల పెంపకానికి అవసరమైన నీడనిచ్చే మొక్కల నర్సరీలను నిర్వహించాలని తెలిపారు. రూ.20నుంచి రూ.25కోట్లతో కడియం నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తామని చెప్పారు.
రైతుల సంక్షేమానికి కృషి చేయాలి: అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అధికారులు కృషిచేయాలని, సకాలంలో విత్తనాలు,వ్యవసాయ పరికరాలు పంపిణీ చే యాలని తెలిపారు. గిట్టుబాటు ధరతో గిరిజన వ్యవసాయ,వాణిజ్య ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో అన్ని గిరిజన కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ అభిషేక్‌గౌడ, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు అపూర్వభరత్, సింహాచలం, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఎంహెచ్‌వో డాక్టర్ నారాయణమూర్తి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
దిశ సమావేశంలో సీ్త్ర శిశుసంక్షేమశాఖ, నాబార్డుకు సంబంధించిన వాల్ పోస్టర్లు,బుక్‌లెట్‌లను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్,అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం ఆవిష్కరించారు.
దిశ కమిటీ అధ్యక్షురాలు,
అరకు ఎంపీ తనూజరాణి


