గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం
డుంబ్రిగుడ: అడవినే నమ్ముకున్న గిరిపుత్రుల సంపూర్ణ అభివృద్ధే ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. సోమవారం ఆయన డుంబ్రిగుడ మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అడవితల్లి బాట కార్యక్ర మాన్ని ప్రారంభించామని చెప్పారు. అడవితల్లికి ఏదో చేయాలనే ఆలోచనలతో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిధుల ఖర్చు విషయంలో బాధ్యతగా ఉంటున్నామని చెప్పారు.
మండల పర్యటన సందర్భంగా పీవీటీజీ గిరిజన మహిళలు సంప్రదాయ కూవీ భాషలో పాటలు పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అడ్డాకులతో తయారు చేసిన గిడుగులను బహూకరించారు. అనంతరం ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు బాలామృతం తినిపించి, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు డుంబ్రిగుడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
విద్యార్థులకు అవస్థలు
డుంబ్రిగుడలో నిర్వహించిన బహిరంగ సభ లో విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. జనం లేకపోవడంతో డుంబ్రిగుడ ప్రభుత్వ సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వారికి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు. సభా ప్రాంగణంలో ఆహార పొట్లాలు కూడా అరకొరగా అందించారు. అవికూడా సరిగా ఉడకకపోవ డంతో తీసుకున్నవారు తినకుండా పడేశా రు. కూటమి నాయకులు జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అయితే ఉపముఖ్యమంత్రి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ పర్యటనతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పోతంగి పంచాయతీ చాపరాయి వద్దకు చేరుకున్న సమయంలో రోడ్డుకుఇరువైపులా పోలీసు లు ప్రయాణికుల జీపులు, ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు అడ్డుకోవడంతో పాడేరు –అరకు రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం


