నేటి నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్
● 683 మంది సిబ్బంది నియామకం
● డీఈవో బ్రహ్మాజీరావు
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌ను గురువారం నుంచి పకడ్బందీగా నిర్వహించనున్నట్టు డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు. బుధవారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పాట్ వాల్యుయేషన్‌కు అన్ని విభాగాల అధికారులు,ఉపాధ్యాయులు,ఇతర సిబ్బందిని కలిపి మొత్తం 683 మందిని నియమించినట్టు చెప్పారు.స్ట్రాంగ్ రూమ్, బందోబస్తును పోలీస్‌శాఖ అధికారులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.


