పశుసంపద పరిరక్షణకు కృషి
సాక్షి,పాడేరు: ఉపాధి హమీ పథకం నిధులు రూ.50.25లక్షలతో జిల్లాలో పశువులకు 150 తాగునీటి తొట్టెలను నిర్మిస్తున్నామని, కలెక్టర్
ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. కుమ్మరిపుట్టు గ్రామంలో పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణ పనులకు కలెక్టర్ మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశుసంపద పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. వేసవిలో పశువులకు తాగునీటి దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా నీటి తొట్టెల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.33,500 ఖర్చు చేస్తున్నామన్నారు. డ్వామా పీడీ విద్యాసాగర్, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఉపాధి హమీ పథకం ఏపీడీ శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు.
రూ.50.25లక్షలతో
నీటితొట్టెల నిర్మాణం
కలెక్టర్ దినేష్‌కుమార్


