– పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు
ఎటపాక: మండలంలోని గౌరిదేవిపేట పంచాయతీ పరిధిలోని బాడిశవారి గుంపు గ్రామంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈఘటనపై ఆలస్యంగా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. గ్రామంలోని నాలుగేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మడకం చిట్టిబాబు(38) అనే వ్యక్తి ఈనెల 18న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించినా న్యాయం జరగక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కన్నపరాజు చెప్పారు.