విలక్షణం..
శ్రమలోనే ఉంది అసలైన జానపదం.. శ్రమలోనే ఉంది ఐకమత్యం.. శ్రమలోనే ఉంది అలుపెరగని జీవనపోరాటం.. శ్రమయేవ జయతే.. అదే వీరి నినాదం. అందుకే రాష్ట్రాలు దాటి వీరి ప్రయాణం..పని కోసం భారం, దూరం లెక్క చేయని నైజం.. పనిలోనే ఆనందాన్ని దర్శిస్తూ సాగుతుంది ఒడిశా
ఆదివాసీల జీవనయానం..
● రాష్ట్రాలు దాటి పనికోసం.. ఆదివాసీల ప్రయాణం
● వాగులు, వంకలు, ఇసుక తిన్నెల్లోనే నివాసాలు
● మూడు నెలలు ఇక్కడే పనులు
● తిరుగు ప్రయాణంలో కూలీలు
● సుమారు 10వేల మంది ప్రతి ఏటా రాక
వలస కూలీల బతుకు చిత్రం
ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు..సమష్టిగా పనిచేయడం వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వీరి నైజం. కల్మషం లేని హృదయాలు వీరివి. వీరంతా వలస కూలీలు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్,ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలి పనుల కోసం ఇక్కడకి వలస వచ్చి, మూడునెలల పాటు ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక,కూనవరం,వీఆర్‌పురం మండలాలతో పాటు తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల,వెంకటాపురం,వాజేడు మండలాలు,ఏలూరు జిల్లాలోని కుక్కునూరు,వెలేరుపాడు మండలాల్లో మిర్చి పంటను సుమారు10 వేల ఎకరాల్లో సాగుచేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి నెల ప్రారంభంలోనే కుటుంబ సమేతంగా తిండిగింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.ఎందుకంటే వీరొస్తేనే మిర్చి, పొగాకు పంటలు చేతికొచ్చేది. వేల మంది వలస కూలీలు ఈ నెలాఖరు వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు.
వలస జీవన సౌందర్యం