చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి తగ్గింది. దీంతో ధర పెరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో జరిగే సంతలకు ఉదయా | - | Sakshi
Sakshi News home page

చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి తగ్గింది. దీంతో ధర పెరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో జరిగే సంతలకు ఉదయా

Mar 24 2025 4:41 AM | Updated on Mar 24 2025 4:40 AM

సాక్షి,పాడేరు: చింతపండుకు గిట్టుబాటు ధర లేక జిల్లాలో గిరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిరిజనులను ఆదుకోవాల్సిన గిరిజన సహకార సంస్థ తక్కువ (కిలో రూ.36) ధర ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మైదాన ప్రాంతాల్లో కిలో రూ.60కి అమ్ముడవు తున్న చింతపండుకు కనీనం రూ.50 మద్దతు ధర ప్రకటించాలని గిరిజన రైతులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ జీసీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరో వైపు ప్రైవేట్‌ వ్యాపారులు సిండికేట్‌గా మారి కిలో చింతపండును నాణ్యతను బట్టి రూ.35 నుంచి రూ.40కు కొనుగోలు చేస్తున్నారు.ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చింతపండు వ్యాపారం జోరుగా జరుగుతున్నప్పటికీ గిరిజన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు.

ఏటా రూ.50 కోట్ల వ్యాపారం : మన్యంలోని చింతపండుకు మైదాన ప్రాంతాల్లో అధిక డిమాండ్‌ ఉంది. దీంతో ప్రతి ఏడాది సుమారు రూ.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. జీసీసీ గత ఏడాది 100 లారీల వరకు చింతపండును కొనుగోలు చేసింది.ప్రైవేట్‌ వ్యాపారులు కూడా భారీగా కొనుగోలు చేశారు. జిల్లాలో కొనుగోలు చేసిన చింతపండును తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తారు. మన్యంలో చింతపండు నాణ్యతలో నంబర్‌–1గా నిలుస్తుండడంతో డిమాండ్‌ ఉంది. అయితే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు.

తగ్గిన దిగుబడి : ఈఏడాది మన్యంలో చింతపండు దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతుందని గిరిజన రైతులు ఆశించినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒక చింతచెట్టుకు కనీసం 100 కిలోల వరకు చింతపండు దిగుబడి రావలసి ఉండగా ఈఏడాది 50 నుంచి 60కిలోలు మాత్రమే వచ్చింది. దిగుబడిన తగ్గినా మార్కెట్‌లో కొనుగోలు ధరలు మాత్రం పెరగకపోవడంతో గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు.చింతచెట్ల నుంచి బొట్టలు రాల్చడం, బొట్టల నుంచి చింతపండు సేకరణ,వారపు సంతలకు తరలించడం వంటి పనులన్నీ కష్టంతో కూడుకున్నవే.అయితే మార్కెట్‌లో మాత్రం చింతపండు ధరలు పెరగకపోవడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు.జీసీసీ కిలో రూ.50 ధరతో కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పాడేరు మార్కెట్‌లో చింతపండు విక్రయిస్తున్న మహిళ

చింత పండుకు గిట్టుబాటు ధర కరువు

కిలో రూ.40తో

ప్రైవేట్‌ వ్యాపారులు

కొనుగోలు

దళారులు సిండికేట్‌గా మారి రేటు తగ్గించేస్తున్నారని రైతుల ఆవేదన

జీసీసీ కిలోకు

రూ.36 మద్దతు

ధర ప్రకటన

కష్టానికి తగ్గ ఆదాయం లేదు

చింతపండు సేకరణ నుంచి అమ్మకాల వరకు అధికంగా కష్టపడాలి. మార్కెట్‌లో కొనుగోలు ధరలు మాత్రం పెరగకపోవడంతో కష్టానికి తగిన ఆదాయం రావడం లేదు.జీసీసీ కిలోకు రూ.50మద్దతు ధర ప్రకటిస్తే ప్రైవేట్‌ వ్యాపారుల్లోను పోటీ ఏర్పడి చింతపండు రైతులకు మంచి లాభాలు వస్తాయి.

– పి.కోటిబాబు, గిరిజన రైతు,

పెదకోడాపల్లి, పెదబయలు మండలం

 చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగా1
1/3

చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగా

 చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగా2
2/3

చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగా

 చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగా3
3/3

చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement