అభివృద్ధి వివరాలు సక్రమంగా నమోదు చేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి వివరాలు సక్రమంగా నమోదు చేయండి

May 21 2025 1:56 AM | Updated on May 21 2025 1:56 AM

అభివృద్ధి వివరాలు సక్రమంగా నమోదు చేయండి

అభివృద్ధి వివరాలు సక్రమంగా నమోదు చేయండి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశం

సాక్షి,పాడేరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు సక్రమంగా నీతిఆయోగ్‌ వెబ్‌సైట్‌లో నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి నీతిఆయోగ్‌ యంగ్‌ ప్రొఫెసర్‌ లోకేష్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మైక్రో ఇరిగేషన్‌, సీ్త్రశిశు సంక్షేమం, వైద్యం, విద్య, వ్యవసాయం, గృహనిర్మాణ సంస్థల్లో పురోగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులంతా డేటా ఎంట్రీ సక్రమంగా చేయాలన్నారు. కాఫీ, మిరియం, పసుపునకు ఎలక్ట్రానిక్‌ మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ఉపాధి హమీ పథకంలో నిర్మిస్తున్న రోడ్లను నీతి ఆయోగ్‌ వైబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌బాషా, వ్యవసాయాధికారి నందు, ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, హౌసింగ్‌ ఈఈ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమాలు, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లకు నిధులు

జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ద్వారా ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లకు నిధులు కేటాయిస్తామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిధులతో విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జేసీ, ఐటీడీఏ పీవో, డీఆర్‌డీఏ పీడీ, డీఎంహెచ్‌వో, గిరిజన సంక్షేమశాఖ, పలు ఇంజనీరింగ్‌శాఖలు, ప్రభుత్వం నామినేట్‌ చేసిన స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులతో కమిటీని వెంటనే వేసి తనకు అందజేయాలని జిల్లా మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారి ఎం.ఆనంద్‌ను ఆదేశించారు. జిల్లాలోని 250 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లకు స్టౌల కొనుగోలుకు రూ.50లక్షలు కేటాయిస్తామన్నారు. పాడేరు డివిజన్‌లోని ఐదు మండలాలకు యోగా శిక్షణ ఇచ్చినట్టుగానే మిగిలిన ఆరు మండలాలు, రంపచోడవరం పరిధిలో మండలాల విద్యార్ధులకు యోగ శిక్షణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్‌ మెరుగుకు 8,9,10 తరగతుల విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసన నైపుణ్యాల మెరుగుకు సుమారు రూ.1.50 కోట్లతో మెల్బోర్న్‌ విశ్వ విద్యాలయంతో టైఅప్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. వచ్చేనెల 21న అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఈనెల 21 నుంచి వచ్చే నెల 21వతేదీ వరకు గ్రామ,మండల,జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస చేయాలన్నారు. వివిధ కేటగిరీల ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర, స్వచ్చంద సంస్థలు, ఎస్‌హెచ్‌జీలతో యోగా చేయించాలని సూచించారు.ఈనెల 21న మాస్టర్‌ ట్రైనీలను గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో వర్చువల్‌గా జేసీ, పాడేరు ఇన్‌చార్జి పీవో డాక్టర్‌ అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, సబ్‌కలెక్టర్‌ సౌర్యమన్‌పటేల్‌ తదితర పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement