
ఉపాధ్యాయ, ప్రజా సంఘాల మధ్య వైరుధ్యం తగదు
● దండకారణ్య ఉద్యోగ సమితి
రాష్ట్ర సలహాదారు మాణిక్యం సమిరెడ్డి
జి.మాడుగుల: ఉపాధ్యాయ, ప్రజా సంఘాల మధ్య వైరు ధ్యం తగదని దండకారణ్య ఉద్యోగ సమి తి (డీఎల్వో) రాష్ట్ర సలహాదారు మాణిక్యం సమిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరుతో మాట్లాడారు. జిల్లాలో అమలుకాని ఆదివాసీ భూ పట్టాలు, హక్కులు, పాడేరు ఐటీడీఏలో అధికారుల అవినీతి, ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో ఉద్యోగుల తిష్ట, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై డీఎల్వో విడుదల చేసిన కరపత్రాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. స్వయంపాలన రాజ్యాధికారం కోసం డీఎల్వో పోరాటం చేస్తుందని, ఉద్యమాల్లో తొందరపాటు విమర్శలు చేయవద్దని ఆయన సూచించారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ విద్యార్థి సంఘాలు, పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు ఆదివాసీ ప్రతినిధులు ఏకమై ఐక్య ఉద్యమాలు చేసేందుకు మేధావులు కృషి చేయాలని ఆయన కోరారు.