
పోలీసు స్టేషన్ల తనిఖీ
అరకులోయ టౌన్: స్థానిక పోలీస్ సర్కిల్ పరిధిలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లలో ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఐలకు సూచించారు. గంజాయి రవాణా కాకుండా చూడాలని, ప్రతిరోజు వాహనాలను క్షుణంగా తనిఖీ చేయాలన్నారు. గ్రామాల్లో పర్యటించి చిల్లంగి, మూడనమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ అహ్మద్, అరకులోయ సీఐ ఎల్. హిమగిరి, ఎస్‌ఐలు జి. గోపాలరావు, శ్రీనివాసరావు, పాపినాయుడు పాల్గొన్నారు.