
కలప అక్రమ రవాణా కేసులో అపరాధ రుసుం వసూలు
రాజవొమ్మంగి: అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన మారుజాతి కలప కేసులో రూ.1,37,349 అపరాధ రుసం విధించినట్టు అటవీక్షేత్రాధికారి ఉషారాణి తెలిపారు. ఈఏడాది మార్చి 15వ తేదీన 14 టన్నుల మారుజాతి కలపతో వెళుతున్న వ్యాన్‌ను అడ్డతీగల మండలం, మర్రివీడు, తిమ్మాపురం గ్రామశివార్లలో రాజవొమ్మంగి అటవీ అధికారులు పట్టుకొని సీజ్ చేయడం తెలిసిందే. ఈ ఘటనలో రామకృష్ణ, అంజిబాబు అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా వీరు అటవీశాఖ విధించిన అపరాధ రుసుంను పూర్తిగా చెల్లించడంతో వ్యాన్‌ను విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రాజవొమ్మంగి శివారు అటవీప్రాంతం నుంచి సింధుగ చెట్టు కలప ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఆమె తెలిపారు ఆరు దుంగలుగా పట్టుబడిన ఈ కలప విలువ రూ. 10 వేలు ఉంటుందన్నారు. ఈ కేసులో ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు అటవీక్షేత్రాధికారి పేర్కొన్నారు.