ట్విన్స్ పుట్టారన్న ఆనందం మాయదారి రోగంతో మాయం, 17 ఏళ్లొచ్చినా!

My Twins Suffer From A Rare Disease Unable To Walk please Help! - Sakshi

17 ఏళ్లు అయినా ఇంకా పసిపిల్లల్లా పాకుతూనే ఉన్న కన్నబిడ్డల్ని  చూసి తల్లిడిల్లిపోతున్న తల్లితండ్రుల ఆవేదన ఇది.. ‘మేమిద్దరం మాకిద్దరం’  అ​న్నట్టుగా ఇద్దరు కవల పిల్లలతోపాటు నలుగురు కుటుంబ సభ్యులూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మాయదారి వ్యాధి వారి జీవితాల్లో కల్లోలం నింపింది.  దీంతో తమ కన్నబిడ్డల్ని  ఎలాగైనా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

దామోదరన్‌, అతని భార్యకు ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు. వారికి అల్లారుముద్దుగా రామర్ , లక్ష్మణన్‌ అని పేరు పెట్టుకున్నారు. పుట్టిన కొన్ని నెలల వరకు కుటుంబం అంతా ఆనంద క్షణాలను ఆస్వాదించారు.  కానీ.. నెలలు పెరిగే కొద్దీ తమ బిడ్డల్లో ఎదుగుదల లోపం ఉన్నట్టు గుర్తించారు. సరైన చికిత్స అందించేందుకు ఎన్నో ఆస్పత్రులు  చుట్టూ తిరిగారు.  చివరికి వైద్యులు చెప్పిన సంగతి విని  దామోదరన్‌ దంపతులు నిలువునా కుంగిపోయారు.  భవిష్యత్తు భయంకరంగా తోచి వణికిపోయారు. 

‘స్పాస్టిక్ డిప్లెజియా’ అనే అరుదైన వ్యాధి కారణంగానే వారికిలా జరుగుతోందని వైద్యులు నిర్ధారించారు. స్పాస్టిక్ డిప్లెజియా సెరిబ్రల్ పాల్సీ చిన్నపిల్లల్లో మెదడుకు వచ్చే అరుదైన పక్షవాతం. బాల్యంలో లేదా చిన్నతనంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇది కండరాల నియంత్రణ , సమన్వయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. మెదడు ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లనే చూపు కూడా మందగించింది. వారి స్వంతంగా ఏమీ చేసుకోలేకపోతున్నారు. నడవడానికి  కూడా ఇబ్బంది పడుతున్నారు.

కవలలకు చికిత్సకు  రూ. 6,00,000 ($7359.03) ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దామెదరన్‌ దంపతులు ఆందోళనలో పడిపోయారు. 65 ఏళ్ల  రోజుకూలీగా పనిచేస్తున్న దామోదరన్‌ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉన్నదంతా తెగనమ్మి బిడ్డలకు వైద్యం చేయించారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టే తిరుగుతుండటంతో ఉన్న ఆ కాస్త రాబడి కూడా లేదు. మరోవైపు అప్పులు, వైద్య బిల్లులు కొండలా పేరుకు పోయాయి. ఈ నేపథ్యంలో దాతలు పెద్దమనసుతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు దామోదరన్‌ దంపతులు. రోజులు గడిచే కొద్దీ, నిమిష నిమిషానికీ తమ బిడ్డల పరిస్థితి దారుణంగా మారుతోందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కవల పిల్లలైన రామర్‌, లక్ష్మణన్‌ కోలుకోవాలంటే మీ ఆదరణే దిక్కు. దయచేసి  పిల్లలను రక్షించడంలో మాకు సహాయం చేయమనివారు ప్రార్థిస్తున్నారు. (అడ్వర్టోరియల్‌)

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top