ఇప్పటికే ఓ బిడ్డను పోగొట్టుకున్నా.. మళ్లీ ఆ బాధ తట్టుకోలేను..

I Have Already Lost A Child Do not Let Me Lose My Newborn Too Please Help - Sakshi

కన్మణి నర్సుగా పని చేస్తోంది. తన చేతుల మీదుగా ఎన్నో కాన్పులు చేసింది. ఎంతో మంది చిన్నారులను ఈ లోకంలోకి తీసుకు వచ్చింది. కానీ విధి వక్రించి 2019 ఆమెకు పుట్టిన బిడ్డ నిమిషాల్లోనే చనిపోయాడు. ఆ బాధతో కన్మణి నర్సు ఉద్యోగం మానేసి నిరంతరం బాధతోనే ఉండిపోయేది.

ఐవీఎఫ్‌ పద్దతులు పాటిస్తూ మరోసారి గర్భవతి అయ్యింది కన్మణి. 2022 ఫిబ్రవరిలో ఆరు నెలలు నిండగానే ఎప్పుడెప్పుడు బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని ఎదురు చూడసాగింది. ఇంతలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. లోపల బిడ్డకు ఏం జరుగుతుందో అనే కంగారులో వెంటనే ఆస్పత్రికి వెళ్లారా దంపతులు. 

వెంటనే కాన్పు చేయకపోతే తల్లిబిడ్డలను ప్రమాదమని చెప్పారు డాక్టర్లు. నెలలు నిండకుండానే పుట్టడంతో బాబు ఆరోగ్యం విషమంగా మారింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఎన్‌ఐసీయూలోనే ఉన్నాడు. ఒక్కసారిగా కూడా తనివితీరా తమ చేతులతో బిడ్డను తాకింది లేదు, పట్టుకున్నది లేదు. సరైన వైద్యం అందివ్వకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు.


సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

ఎన్‌ఐసీయూలో ఉంచి బాబుకు వైద్య చికిత్స అందించేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కన్మణీ ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదు. ఆమె భర్త ప్రవీణ్‌ ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతంతో బతుకుతున్న ఈ దంపతులకు రూ. 20 లక్షల డబ్బును సమకూర్చడం కష్టమైన పని. తొలికాన్పులో బిడ్డను కోల్పోయి జీవచ్ఛవంలా బతుకుతున్న కన్మణి, ఆమె బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. (అడ్వెర్‌టోరియల్‌)
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top