గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ, జెడ్పీటీసీ)కు నామినేషన్ల ఘట్టం ముగిసింది. గత మూడు రోజులుగా విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. జెడ్పీ ఆర్వో పి. సుశీల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని 16 జెడ్పీటీసీలకు మొత్తం 135 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజు ఏకంగా 78 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్ సీపీ 40, టీడీపీ 52, జనసేన 14, కాంగ్రెస్ 6, సీపీఎం 5, బీజేపీ 5, బీఎస్పీ 6, స్వతంత్రులు 4, ఇతరులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా జగ్గయ్యపేట 9, వత్సవాయి 7, పెనుగంచిప్రోలు 9, నందిగామ 5, వీరులపాడు 14, కంచికచర్ల 10, చందర్లపాడు 4, మైలవరం 8, జి.కొండూరు 9, రెడ్డిగూడెం 6, ఇబ్రహీంపట్నం 8, విజయవాడ రూరల్ 12, తిరువూరు 7, ఏ కొండూరు 9, విస్సన్నపేట 5, గంపలగూడెం 13 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఎంపీటీసీ స్థానాలకు 1641 నామినేషన్లు
జిల్లాలోని 16 మండలాల్లో 280 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం 1641 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ఒక్కరోజే 892 నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా జగ్గయ్యపేట 139, వత్సవాయి 122, పెనుగంచిప్రోలు 102, నందిగామ 81, వీరులపాడు 88, కంచికచర్ల 119, చందర్లపాడు 83, మైలవరం 106, జి. కొండూరు 80, రెడ్డిగూడెం 72, ఇబ్రహీంపట్నం 59, విజయవాడ రూరల్ 192, తిరువూరు 71, ఏ. కొండూరు 75, విస్సన్నపేట 95, గంపలగూడెం 157 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వైఎస్సార్ సీపీ 723, టీడీపీ 701, జనసేన 94, సీపీఎం 24, బీజేపీ 18, బీఎస్పీ 11, స్వతంత్రులు 63 నామినేషన్లు కాగా మిగిలినవి ఇతర పార్టీలు వేశాయి.


