ముదిరాజ్‌ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

● ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

● ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్‌: ముదిరాజ్‌ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, వారి అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన భీమన్న, పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆలయంలో పూ జలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ బీసీలు ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే అంశంపై నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఇందులో మాజీ మంత్రి రామన్న, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, ఏఎంసీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, చిట్యాల సుహాసినిరెడ్డి, ముదిరాజ్‌ సంఘం పట్టణ అధ్యక్షుడు దారవేణి రాము, నగేశ్‌, రవి, లస్మన్న, రాజు, శివయ్య, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement