పేదల సొంతింటి కల సాకారం
తాంసి: ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. మండలంలోని పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారు లక్ష్మి–రామన్న నూతన గృహ ప్రవేశానికి కలెక్టర్ ఆదివారం హాజరయ్యారు. దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులందరికీ విడతల వారీ గా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కా ర్యక్రమంలో ఆత్మచైర్మన్ నారాయణ, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ జాదవ్ గణేశ్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ రాంరెడ్డి, పంచా యతీ కార్యదర్శి గంగన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా నీట్ పీజీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ రాజర్షిషా కేంద్రాన్ని తనిఖీ చేశా రు. నిర్వహణ తీరు, వసతులపై ఆరా తీశారు. అ భ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పా ట్లు చేయాలని, ప్రవేశ ప్రక్రియ, బయోమెట్రిక్ తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రంలో మొత్తం 100 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, డీఐ ఈవో గణేశ్ జాదవ్, పరీక్షల లైజన్ అధికారి శ్రీధర్, తహసీల్దార్ వేణు, అధికారులు, కళాశాల ప్రతినిధులు తదితరులున్నారు.
రేపు గణేశ్ ఉత్సవ
కమిటీ సభ్యులతో సమావేశం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని తనిషా గార్డెన్‌లో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరవుతారని తెలిపారు. పట్టణ, ఆయా మండలాలు, గ్రామాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.


