ఇంద్రవెల్లి: అన్నాభావుసాఠే తన రచనలు, సా హిత్యం ద్వారా సమాజహితం కోసం చేసిన కృషి నేటితరానికి స్ఫూర్తిదాయకమని ఎంపీ గో డం నగేశ్ అన్నారు. మండలంలోని హీరాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన అన్నాభా వుసాఠే జయంతి కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడారు. యువత అన్నాభావుసాఠే జీవితా న్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కామ్లే బాలాజీ, కేస్లాపూర్, తేజ్‌పూర్ సర్పంచ్‌లు మెస్రం తుకారాం, కోవ రాజేశ్వర్, అన్నాభావుసాఠే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిశోర్, మాంగ్ సమాజ్ నాయకులు రామారావ్, గోవింద్, నర్సయ్య, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.


