కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల గర్జన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల గర్జన

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

కైలాస్‌నగర్‌: సమస్యల పరిష్కారానికి ఉద్యోగ, ఉ పాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కదం తొక్కారు. గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవన్‌ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నాయకుడు వెంకట్‌ మాట్లాడారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం మినహా రాష్ట్ర ప్రభుత్వం మరే సమస్య పరిష్కరించడం లేదని ఆరోపించారు. పీఆర్‌సీ నివేదిక సిద్ధంగా ఉన్నా అమలు చేయడంలేదని, ఆరు పెండింగ్‌ డీఏలు చెల్లించాలని కోరారు. రూ.10వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు భేషరతుగా వెంటనే విడుదల చేయాలని, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీంను పకడ్బందీగా అమలు చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌ నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. వీరికి మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులు నవీన్‌కుమార్‌, కె.శివకుమార్‌, కె.కృష్ణకుమార్‌, స్వామి, కె.కిష్టన్న, వి.అశోక్‌, ఎం.శ్రీనివాస్‌, జె.రవికుమార్‌, ఎం.శ్రీనివాస్‌, బి.వృకోధర్‌, నవీన్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement