ఆదిలాబాద్‌టౌన్/ఆసిఫాబాద్‌రూరల్:: రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్య సంబంధిత విషయాల పరిశోధన కోసం ఆదిలాబాద్ జి ల్లా బోథ్ మండలంలోని ధనోర జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచే స్తున్న రాజు చోప్డే, కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ ఎంఈవో రాథోడ్ సుభాష్ ఎంపికయ్యారు. మొదటి విడతలో ఆదిలాబాద్ జి ల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంటకు చెంది న గంగయ్య పిన్‌ల్యాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. రెండో విడతలో రాజు చోప్డే, రాథో డ్ సుభాష్ సెప్టెంబర్ 19న సింగపూర్ వెళ్లనున్నారు. ఏడు రోజుల పాటు అక్కడి విద్య విషయాలను పరిశీలించనున్నారు. వి ద్యారంగానికి సంబంధించిన అంశాలను జి ల్లాలో అమలుచేసేలా చర్యలు చేపట్టనున్నారు.
సుభాష్


