నెల్లూరు(బృందావనం): ఏవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురమందిరంలో సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహిస్తామని నిర్వాహకుడు కేతా సుబ్బారావు తెలిపారు. ఆహ్వానపత్రికలను మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత వీరిశెట్టి హజరత్‌బాబు, ప్రపంచతెలుగు సమాఖ్య నెల్లూరు ప్రాంతీయ అధ్యక్షుడు నలుబోలు బలరామయ్యనాయుడు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తమ విద్యాబోధన చేస్తున్న తొమ్మిది మంది గురువులకు విద్యారత్న పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించనున్నామన్నారు. పాటలు, డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు 77299 42543 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


