సర్కారు బడుల్లో సైన్స్‌ ల్యాబ్‌లు | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో సైన్స్‌ ల్యాబ్‌లు

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట ఆదిలాబాద్‌లో 18, నిర్మల్‌లో 6, ఆసిఫాబాద్‌లో 3, మంచిర్యాలలో 2 స్కూళ్లు ఎంపిక ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షల నిధులు

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులకు నాణ్యమైన, ప్రయోగాత్మక విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 287 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 29 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షల చొప్పున నిధు లు మంజూరు చేశారు. తొమ్మిది, పదో తరగతి వి ద్యార్థులకు ప్రయోగాల ద్వారా సైన్స్‌ అంశాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించను న్నారు.

ఉమ్మడి జిల్లాలో 29 పాఠశాలలు ఎంపిక

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 29 పాఠశాలలు ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌లో 18, ఆసిఫాబాద్‌లో 3, నిర్మల్‌లో 6, మంచిర్యాలలో 2 పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతీ పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు రూ.26 లక్షలు కేటాయించారు. ఇందులో ల్యాబ్‌ గది నిర్మాణానికి రూ.25 లక్షలు, ప్రయోగశాలకు అవసరమైన పరికరాల కొనుగోలు కోసం రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 287 పాఠశాలలకు ల్యాబ్‌ గదుల నిర్మాణానికి రూ.71.75 కోట్లు, పరికరాల కోసం రూ.2.87 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తంగా రూ.74.62 కోట్లతో పనులు చేపట్టనున్నారు.

పేద విద్యార్థులకు ప్రయోజనం..

ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానుండడంతో పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రయోగశాలలు లేకపోవడం, సౌకర్యాల లేమితో సైన్స్‌ చదువుతున్న విద్యార్థులకు ఇకపై ప్రయోగాలు చేసే అవకాశం లభించనుంది. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను స్వయంగా ప్రయోగాల ద్వారా పరిశీలించడం ద్వారా సైన్స్‌పై ఆసక్తి పెరగడంతో పాటు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటుతో కేవలం పరికరాలు అందుబాటులోకి రావడమే కాకుండా బోధన విధానంలోనూ మార్పు రానుంది. ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించిన అంశాలను ల్యాబ్‌లో ప్రయోగాల ద్వారా విద్యార్థులకు వివరిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా మారనుంది. వీటి నిర్మాణానికి 15 రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత విద్యా శాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఆదిలాబాద్‌లో ఎంపికై న పాఠశాలలు..

కేజీబీవీ (బోథ్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ (బరంపూర్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ (సుంకిడి), జెడ్పీహెచ్‌ఎస్‌ (తోషం), యూపీఎస్‌ (కొల్హారి), యూపీఎస్‌ (ఖానాపూర్‌ కాలనీ), కేజీబీవీ (భీంపూర్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ (శ్యామ్‌పూర్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ (రాంనగర్‌), కేజీబీవీ (ఆదిలాబాద్‌రూరల్‌), కేజీబీవీ, తాంసి(బి), జెడ్పీహెచ్‌ఎస్‌ (కుచులాపూర్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ (లక్కారం), కేజీబీవీ (ఇచ్చోడ), జెడ్పీహెచ్‌ఎస్‌ (ఉట్నూర్‌ ఉర్దూ మీడియం), యూపీఎస్‌ (భీంపూర్‌), కేజీబీవీ (ఇంద్రవెల్లి), జెడ్పీహెచ్‌ఎస్‌, ధనోర(బి)

నిర్మల్‌ జిల్లాలో..

కేజీబీవీ (తానూర్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ (బోరెగాం), జెడ్పీహెచ్‌ఎస్‌ (పెంబి), జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికలు (ముధోల్‌), జెడ్పీహెచ్‌ఎస్‌ (మాటేగాం), జెడ్పీహెచ్‌ఎస్‌ (అనుసూయపవార్‌ నగర్‌)

మంచిర్యాల జిల్లాలో..

కేజీబీవీ (మందమర్రి), జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర, (మందమర్రి, ఒర్రెగూడ)

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..

జెడ్పీహెచ్‌ఎస్‌ (రాస్‌పల్లి), కేజీబీవీ (చింతలమానెపల్లి), కేజీబీవీ (పెంచికల్‌పేట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement