వన మహోత్సవ లక్ష్యాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవ లక్ష్యాలు పూర్తి చేయాలి

Aug 25 2026 12:15 AM | Updated on Aug 25 2026 12:15 AM

● రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ

కై లాస్‌నగర్‌: వన మహోత్సవ లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, దేవా దా య శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున గడువులోపు ల క్ష్యాలు సాధించేలా మొక్కలు నాటాలన్నారు. మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ మాస్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయ క సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు తదితర ప్రాంతా ల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ రాజర్షి షా అధికారులతో మాట్లాడుతూ మంగళవారం తలపెట్టిన భారీ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆదిలాబాద్‌, ఇచ్చోడ అటవీ అభివృద్ధి అధికారులు విశ్వనాథ్‌ బుసిరెడ్డి, ప్రథమేష్‌, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, ఏపీడీ గజానన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement