పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

ఆదిలాబాద్‌టౌన్‌: పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ అన్నారు. పట్టణంలోని వన్‌టౌన్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఉత్సవకమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించా రు. ఇందులో ఆది లాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, సీఐలు సునిల్‌ కుమార్‌, నాగరాజు, ప్రేమ్‌ కుమార్‌, రహీం పాషా, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రతిభ కనబర్చిన

పోలీస్‌ సిబ్బందికి రివార్డులు

విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల బస్టాండ్‌లో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పట్టుకోవడంతో పాటు మహిళపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించి చురుకై న పాత్ర పోషించిన షీటీమ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement