ఫెర్టిలైజర్‌ ఫ్రాంచైజీ పేరిట భారీ మోసం | - | Sakshi
Sakshi News home page

ఫెర్టిలైజర్‌ ఫ్రాంచైజీ పేరిట భారీ మోసం

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

● అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌ ● బిహార్‌లో తలదాచుకుంటూ మోసాలు ● రూ.3.5 కోట్ల వరకు అక్రమ వసూళ్లు ● వెల్లడించిన ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న బిహారీ ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులుండగా నేషనల్‌ ఫెర్టిలైజర్‌ ఫ్రాంచైజీ పేరిట పలువురిని నమ్మించి రూ.లక్షల్లో మోసగించారు. దేశ వ్యాప్తంగా వీరిపై 498 ఫిర్యాదులు రాగా, ఇందులో తెలంగాణకు చెందినవి 90 ఉన్నాయి. వీరు అమాయకుల వద్ద రూ.3.5 కోట్ల వరకు వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ శుక్రవారం ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితులు బిహార్‌ రాష్ట్రంలో తలదాచుకుంటూ దేశ వ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఫెర్టిలైజర్‌ ఫ్రాంచైజీ ఇచ్చే వెబ్‌సైట్‌ను తయారు చేసి అప్లికేషన్‌ ద్వారా బాధితుల వివరాలు, వారి ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించారు. సర్వీస్‌ ఫీజు, లైసెన్స్‌ ఫీజు, ట్రేడ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీజు అంటూ విడతల వారీగా వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. బజాజ్‌ లోన్‌ అంటూ అప్లికేషన్‌ ద్వారా వివరాలు సేకరించి వివిధ రకాల ఫీజులు వసూలు చేసి వందలాది మందిని మోసగించారు.

జైనథ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు

నేషనల్‌ ఫెర్టిలైజర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ప్రకటన ద్వారా ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి భోరజ్‌ మండలం మాండగడ గ్రామానికి చెందిన ఆకునూర్‌ గణేశ్‌ను నిందితులు నమ్మించారు. బాధితుడిని ఫోన్‌, వాట్సాప్‌, ఈమెయిల్‌ ద్వారా సంప్రదించి వ్యక్తిగత వివరాలు సేకరించారు. మొదట రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.50వేలు వసూలు చేశారు. ఆ తర్వాత లై సెన్స్‌, ప్రాంచైజీ, రిజిస్ట్రేషన్‌ అదనపు చార్జీలు, వివి ధ కారణాలు చూపుతూ బాధితుడి నుంచి రూ. 3,85,725 నగదును బ్యాంక్‌ ఖాతాలో యూపీఐ, నెఫ్ట్‌ ద్వారా బదిలీ చేయించుకున్నారు. అనంతరం ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడం, వాట్సాప్‌ మెస్సేజ్‌లకు స్పందించకపోడంతో బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీ సులు బిహార్‌కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. బిహార్‌లోని బిగా గ్రామానికి చెందిన అభిషేక్‌ కుమార్‌, అశితోష్‌ కుమార్‌, రితేశ్‌ కుమార్‌, అభినాష్‌, హుసేన గ్రామానికి చెందిన నిషుకుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 10 సెల్‌ఫోన్లు, రూ.70వేల నగదు స్వాధీనం చే సుకున్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ.8లక్షలను నిందితులు బ్యాంక్‌ ఖాతాలు, స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయగా వాటి పత్రాల ను పోలీసులు సీజ్‌ చేశారు. ఎవరైనా సైబర్‌ మోసా ల బారిన పడితే వెంటనే 1930కు సమాచారం ఇ వ్వాలని సూచించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రె డ్డి, జైనథ్‌ సీఐ శ్రావణ్‌, ఎస్సైలు పీర్‌సింగ్‌, గౌతమ్‌, గోపీకృష్ణ, సిబ్బంది త్రిశూల్‌, రాజేశ్‌, పురుషోత్తం, రవీందర్‌, సత్యనారాయణ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement