నార్నూర్: మండలంలోని నాగల్‌కొండ గ్రామానికి చెందిన షేక్ అసిఫ్ నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటాడు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదువుకున్న షేక్ అసిఫ్ స్టేట్ 1,419వ ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమ్ర మహదు, మసీదు కమిటీ సదర్ హబీబ్‌ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులు షేక్ అసిఫ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో షేక్ అజమ్, షేక్ యూసుఫ్ పటేల్, షేక్ నబీ సాబ్, షేక్ వజీర్ పాషా, షేక్ అజర్, మసీదు కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చింత గింజ మింగి బాలుడి మృతి
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీకి చెందిన మంగేష్ (9) అనే బాలుడు చింత గింజ మింగి ఊపిరాడక శుక్రవారం మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు ఆశాబాయి, జ్యోతిరాం ఇటుకబట్టీ కార్మికులు. వీరికి ఇద్దరు కుమారులు. ఓ కుమారుడు పాఠశాలకు వెళ్లగా చిన్న కొడుకు మంగేష్ ఇంటి వద్దే ఉంటున్నాడు. రోజు మాదిరిగా దంపతులిద్దరూ ఉదయం ఇటుక బట్టీకి వెళ్లారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో చిన్నకొడుకు వారికి టిఫిన్ ఇచ్చి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో చింతగింజ మింగాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారగా గమనించిన స్థానికులు చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఏసీబీ పేరిట ఉద్యోగులకు ఫోన్‌కాల్స్
ఆదిలాబాద్‌టౌన్: ఏసీబీ అధికారులమని 90592 08198 నంబర్‌తో ఫోన్ చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏసీబీ డీఎస్పీ మధు ఓ ప్రకట నలో తెలిపారు. ఇప్పటికే పలువురు ఉద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పేర్కొన్నా రు. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించవద్దని, ఇలాంటి ఫోన్లు వస్తే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని లేదా ఏసీబీ టోల్ ఫ్రీ 1064 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


