బోథ్: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. ఫైళ్లు, రిజిస్టర్లను తనిఖీ చేసిన ఎస్పీ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని పేర్కొన్నారు. సీసీటీఎన్‌ఎస్‌లో రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. మండలంలో గంజాయి, పేకాట, గుడుంబా లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను బాధ్యతతో పరిష్కరించి పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని ఆదేశించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు.


