తలమడుగు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంటుబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. మండలంలోని పల్లి(బి) గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ ఇటీవల పంట చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్మ చేసుకోగా అతడి కుటుంబాన్ని గురువారం బొర్రన్న కలిసి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో అశోక్ తన 4.30 ఎకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయగా, గతేడాది కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో అతడు తీవ్రంగా నష్టపోయి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో 194 ప్రకారం బాధిత కుటుంబానికి రూ.6లక్షల పరిహారంతోపాటు ఆర్థిక భరోసా కల్పించాలని, కుటుంబానికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని, పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటట్ రమాకాంత్, దశరథ్, గంగారెడ్డి, రాజు తదితరులున్నారు.


