మంచిర్యాలక్రైం: రైల్లో ప్రయాణిస్తున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయాలపాలైన సంఘటన బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రైల్వే ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోకి రైలు రాగానే అందులో ప్రయాణిస్తున్న బిహార్‌కు చెందిన ఎండీ ఆలం కుమారుడు ఎండీ అలీ (13) ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. స్థానికులు జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించడంతో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ గాయాల పాలైన అలీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. క్షతగాత్రుడి తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కాగా అలీ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడే ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్తుండగా బాలుడు ప్రమాదానికి గురాయ్య డు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.


