వర్షాకాలంలో తేమ, ఉక్కపోత పెరిగినప్పుడు టేకు డీఫోలియేటర్, టేకు స్కెలిటనైజర్ లార్వాలు వేగంగా వృద్ధి చెంది ఆకుల్లోని పచ్చని భాగాన్ని తినేస్తాయి. కేవలం ఈనెలు మాత్రమే మిగలడంతో చెట్లు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. దీనివల్ల చెట్టు కాండానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. పురుగుల జీవిత చక్రం ముగిశాక లేదా వర్షాలు పడగానే ఈ సమస్య
సమసిపోతుంది.
– డాక్టర్ రూపవత్ చంద్రశేఖర్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్షశాస్త్ర విభాగం


