ఆదిలాబాద్‌టౌన్: అప్రమత్తతతోనే నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని అభినందించారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలతో పాటు నగదు రివార్డులు అందజేశారు. రిమ్స్ వద్ద తనిఖీల సందర్భంగా కత్తులు, తల్వార్లను పట్టుకున్న కానిస్టేబుల్ ఎం.సాయి, రైల్వేస్టేషన్‌లో గంజాయి ప్యాకెట్‌ను పట్టుకున్న కానిస్టేబుల్ కె.కిశోర్, బస్టాండ్‌లో మొబైల్ చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్న కానిస్టేబుల్ ఎస్.నగేశ్‌కు ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


