ఆదిలాబాద్‌టౌన్: సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, జీవో నం.97 వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కోకన్వీనర్ బుదారి గంగాప్రసాద్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. నూతన జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ విభాగంలో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, మైరెన్ ఇంజినీరింగ్, నేవీ తదితర రంగాల్లోని ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఏబీవీపీ జిల్లా కన్వీ నర్ ఆదిత్య, జిల్లా మీడియా కన్వీనర్ సాయి, సిద్దు, శివ, వినయ్,విద్యార్థులు పాల్గొన్నారు.


