ఉట్నూర్‌రూరల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బోర్‌వెల్ మంజూరు చేయాలని గుడిహత్నూర్ మండలం తోయగూడకు చెందిన పెందోర్ వినా యక్, ఆశ్రమ పాఠశాలలో వాచ్‌మెన్ ఉద్యోగం ఇప్పించాలని మంచిర్యాల మండలం పెద్ద గోపాలపూర్‌కు చెందిన హన్మంతు, పై చదువులకు ఆర్థికసాయం అందించాలని కెరమెరికి చెందిన భూదేవి దరఖాస్తు అందజేశారు.


