‘హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం’ | - | Sakshi
Sakshi News home page

‘హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం’

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

ఆదిలాబాద్‌టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు, యువజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి పట్టణంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాదవ సంఘ భ వనంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ సర్కారు 12 ఏళ్ల పాలనలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసిందని తెలిపారు. యువత ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్‌, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఏఐవైఎఫ్‌ నాయకులు మెస్రం భాస్కర్‌, కేశవ్‌, తబ్రేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement